సోషల్ మీడియాను వాడుకుని ఈ మధ్య ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. కొందరు చాలా రోజులకు ఫేమస్ అవ్వగ్గా మరికొందరు మాత్రం చాలా విచిత్రంగా ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సంపాదిస్తారు. అలాంటి వారిలో ఒకరే బర్రెలక్క.. అలియాస్ శిరీషా. నిరుద్యోగం గురించి తాను చేసిన ఓ వీడియో సోషల్ మీడియానే షేక్ చేసింది. అంతే రాత్రికి రాత్రే బర్రెలక్క సెలబ్రిటీ గా మారిపోయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది . వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేసిన పేరు బ‌ర్రెల‌క్క అలియాస్ క‌ర్నె శిరీష‌. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రామానికి చెందిన క‌ర్నె శిరీష అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో మార్మోగిపోయింది. అయితే మ‌రోసారి త‌న పెళ్లితో బ‌ర్రెల‌క్క సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది . బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పెళ్లి మార్చి 28న ఘనంగా జరిగింది. శిరీష అలియాస్ బర్రెలక్క నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ని వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహానికి కుటుంబసభ్యులతో పటు , బంధుమిత్రులు , శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.