ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. మన దేశానికి ఈ ఏడాది చాలా కీలకమైనదన్నారు. ఇజ్రాయెల్ – గాజా, రష్యా – ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాది పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు.