ఈ సాయంత్రం టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరుకావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద వీరికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు.