ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ సెప్టెంబరులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలు అతిక్రమిస్తూ టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. కాగా, సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. నవంబరు 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తదుపరి విచారణను ఏసీబీ న్యాయస్థానం డిసెంబరు 1కి వాయిదా వేసింది. 

విచారణ సందర్భంగా పీటీ వారెంట్ పై సీఐడీ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఇదే కేసులో టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులు అటాచ్ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ఏసీబీ కోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.