స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. 

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా… అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు. ఏఏజీ నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.