సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత బృందం నిన్న రాత్రి విజయవాడకు చేరుకుంది. ఎన్నికల సన్నద్ధత గురించి అధికారులతో వీరు సమీక్షలు నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించనున్నారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీతో వీరు భేటీ అవుతున్నారు. ఒక్కో పార్టీతో 15 నుంచి 20 నిమిషాల పాటు వీరు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో నొవోటెల్ హోటల్ లో సీఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి వీరు వివరించనున్నారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడనున్నారు.