ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేడు జనసేన పార్టీ అధినేత పవన్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ ను కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు.  మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరడం తెలిసిందే.