రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. ప్రతిపక్షాలతో సవాళ్లు ఉంటాయి. మాటల యుద్దాలు ఉంటాయి. ప్రత్యర్థులతో ప్రాణ భయాలు ఉంటాయి. వీటన్నింటిని తట్టుకున్నప్పుడే రాజకేయాల్లో మనుగడ ఉంటుంది. ఇదంతా ఒకెత్తయితే టికెట్ ఇవ్వలేదని దేశంలోనే తొలిసారి ఓ ఎంపీ ఆత్మ హత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నo చేసిన ఈరోడ్ (తమిళనాడు) ఎం‌డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. దీంతో ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన ఎ.గణేశమూర్తిని కుటుంబసభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం కన్నుమూశారు. క్రిమిసంహారక మందు తాగి గణేశమూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు అంతకుమునుపు కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆరుగాలం శ్ర‌మించి పండించిన పంట చేతికి అంద‌లేద‌న్న దిగులుతో రైతులు ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవటం చూశాం. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివినా..పాస్ కాలేక పోయాన‌న్న దిగులుతో విద్యార్థులూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘటనలు చూశాం . ఇక‌, అప్పుల పాలై.. కుటుంబాన్ని పోషించ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి పేదవాడిని చూశాం కానీ కానీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టికెట్ రాలేద‌ని.. ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన నాయ‌కుడిని మొదటిసారి చూసున్నామని ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతోంది. తమిళనాడు ఎం‌డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి రాజకీయ జీవితానికి వస్తే ఈరోడ్‌ నియోజ‌క‌వ‌ర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ. ఏ. గ‌ణేశ మూర్తి వ‌రుస‌గా 40 ఏళ్ల‌కుపైగానే రాజ‌కీయాల్లో ఉన్నారు. త‌మిళ‌నాడుకు చెందిన ఎండీఎంకే పార్టీలో కీల‌క నేత‌గా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎంపీ ఎ. గణేశమూర్తికి ప్ర‌స్తుత లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు . ఎండీఎంకే ప్ర‌స్తుతం అధికార పార్టీ డిఎంకేతో చేతులుక‌లిపింది. దీంతో పొత్తులో భాగంగా కొన్నిసీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది . ప్రస్తుతం ఈరోడ్ పార్ల‌మెంటు స్థానానికి కె.ఇ. ప్ర‌కాష్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. అధికార పార్టీ డీఎంకే యువజన విభాగం నాయకుడు కూడా అయిన ఈయ‌న‌కు అక్కడ భారీ మ‌ద్ద‌తు ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ప్ర‌కాష్‌ సన్నిహితుడు కావటంతో పార్టీ ఆయనవైపు మొగ్గు చూపినట్లు సమాచారం . దీంతో ప్రకాష్ కు టికెట్ ఇచ్చారు. ఈ ప‌రిణామాలను జీర్ణించుకోలేకనే గ‌ణేశ మూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.