భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలిIPL బెట్టింగ్ కు బానిసైన భర్త విపరీతమైన అప్పులు చేయడంతో అతని భార్య బలైంది. ఋణ దాతల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగింది. వృత్తి రీత్యా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అయిన దర్శన్‌ బాబుకు రంజితతో 2020లో వివాహం జరిగింది. 2021 నుంచి దర్శన్‌ IPL బెట్టింగ్ బానిసయ్యాడు. అప్పటి నుంచి కోటికి పైగా అప్పులు చేశాడు. దీంతో ఋణ దాతల వేధింపులు పెరిగాయి. విసిగిపోయిన రంజిత మార్చి 18న అత్మహత్య చేసుకుంది.