హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించిందనటంతో ఏ మాత్రం సందేహం లేదు. సిక్సులు, ఫోర్లతో మైదానం మోతెక్కిపోయింది ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన అతిథ్య సన్‌రైజర్స్ జట్టు విధ్వంసం సృష్టించి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే రికార్డు స్కోరు సాధించినా , ముంబయి ఇండియన్స్ కూడా ఏ మాత్రం తక్కువ చేయలేదు . 278 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇక ఒక ఐపీల్ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య స్కోరు 500 దాటడం ఫస్ట్ టైం. మొత్తం ఈ మ్యాచ్ లో 523 పరుగులు నమోదయ్యాయి. 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మొత్తం స్కోరు 517 పరుగులు ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. పురుషుల టీ20 లీగ్‌లు, ఐపీఎల్‌ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరుగా రెకార్డులోకి ఎక్కింది . ఐపీఎల్‌లో రాజస్థాన్‌, చెన్నై జట్ల మధ్య 2010 సీజన్‌లో సాధించిన 469 పరుగుల స్కోరు ఇప్పటివరకు టాప్ స్కోరుగా ఉండేది. అది ఇప్పుడు బ్రేక్ అయ్యింది. ఐపీఎల్‌ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 277 నమోదు చేసింది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ముంబై ఇండియన్స్ సాధించిన 246 స్కోరు కూడా అత్యధికమే. ఈ మ్యాచ్‌లో మొత్తం సిక్స్‌లు, ఫోర్ల సంఖ్య 69. చెన్నై, రాజస్థాన్‌ జట్లు మధ్య 2010లో జరిగిన మ్యాచ్‌లో 69 బౌండరీలు సాధించాయి. . ఇక ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు – 38గా నమోదయ్యాయి. పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు నమోదయిన మ్యాచ్‌ ఇదే కావటం విశేషం. ఇక ముంబై బ్యాటర్లు సన్‌రైజర్స్‌పై కొట్టిన అత్యధిక సిక్సర్ల సంఖ్య 20. అంతకుముందు రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టు 2013లో ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు కొట్టింది