కష్టాల్లో ఉన్న ప్రజలకు చేయూతనీయడమే ‘జనసేన’ ఆశయం అంటూ పవన్ పదే పదే చెప్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల్లోని సమస్యలను గుర్తించి క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపటమే తన లక్ష్యమని కూడా ఆయన చెప్తుంటారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయంగా ఆయన వెంట నడుస్తున్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్ ఆది ఒకరు. ఇక తాజాగా అనసూయ పవన్ కళ్యాణ్ గురించి స్పందించారు. తనకు ఇప్పటివరకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని కానీ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చాయని చెప్పారు. తనకు పార్టీలు ముఖ్యం కాదని, నాయకులు ముఖ్యమని అన్నారు. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు. తను ప్రచారం చేసినా , ఏదైనా మంచిమాట చెప్పినా వినేవాళ్ళు కొంతమంది ఉన్నారని , అది నా అదృష్టం అని అనసూయ అన్నారు. ఇక రాజకీయ పరంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కమాట చెప్తే పార్టీ తరుపున కచ్చితంగా ప్రచారం చేస్తానన్నారు. ఇక టైం కుదరక పోవటం వల్లే జబర్దస్త్ మానేశానని చెప్పారు. తనకు టైమ్ ఉన్నప్పుడల్లా సెట్స్ కు వెళ్తుంటానని తెలిపారు. గతంలో తనపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… ఆయన కొంచెం పాత కాలం నాటి మనిషి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని చెప్పారన్నారు . కోట శ్రీనివాస్ రావు గారికి తనపై చనువు ఉన్నందువల్లే తాను పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదని చెప్పారన్నారు . దీన్ని వేరే రకంగా అర్థం చేసుకుని నాపై రకరకాలుగా రాశారని మండిపడ్డారు. కోట గారంటే తనకి కూడా చాలా గౌరవమని , ఆయన నన్ను ఇంట్లో మనిషిగా భావిస్తారు కాబట్టే కాబట్టే ఆ విధంగా స్పందించారని చెప్పారు.