‘మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం..మోదీ అసాధారణ పాప్యులారిటీ..రామమందిర ప్రారంభోత్సవం.. వెరసి ప్రధాని సారథ్యంలో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం’ అని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ది గార్డియన్ దినపత్రిలో తన కాలమ్‌లో అభిప్రాయపడ్డారు. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు బీజేపీ బలాన్ని మరింత పెంచాయని హానా ఎల్లిస్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. ఈ విజయాల అనంతరం ప్రధాని స్పందిస్తూ హ్యాట్రిక్ పక్కా అని పేర్కొనడాన్ని కూడా హానా ఎల్లిస్ తన కాలమ్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని బట్టి మోదీకి విజయావకాశాలు ఎక్కువని దేశంలో అధికశాతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నట్టు తేల్చారు.