నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ ‘రాహుల్ సంఘ్వీ’ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లుక్ ను చిత్రబృందం నేడు పంచుకుంది. బీభత్సకరమైన ‘రాహుల్ సంఘ్వీ’గా జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ ను పరిచేయం చేస్తున్నాం అంటూ చిత్ర బృందం వెల్లడించింది. కాగా, భగవంత్ కేసరి నుంచి ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. రేపు (అక్టోబరు 8) రాత్రి 8.16 గంటలకు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణతో పాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించాడు. దసరా సీజన్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అనిల్ రావిపూడి చిత్రాల్లో 100 శాతం ఎంటర్టయిన్ మెంట్ ఉంటుందని తెలిసిందే. దాంతో, బాలయ్య, అనిల్ కాంబోలో వచ్చే ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.