బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ బుధవారం అనారోగ్యానికి గురికాగా వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ అహ్మాదాబాద్‌లోని కేడీ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు. . కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ టీమ్‌ య‌జ‌మాని అయిన షారుక్ మంగళవారం స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మొద‌టి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ కోసం అహ్మ‌దాబాద్‌కు వ‌చ్చారు. మ్యాచ్‌లో విజయానంతరం సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న షారుఖ్ రాత్రి అక్క‌డే బ‌స చేశారు. .అయితే అహ్మాదాబాద్‌లో ఎండ తీవ్ర‌త‌తో షారుఖ్ వ‌డ‌దెబ్బ‌కు గుర‌వ‌డంతో పాటు మైల్డ్ హాట్‌స్ట్రోక్ రావడంతో వెంట‌నే కేడీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. షారుఖ్ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు తెలిపారు. షారుఖ్ ను తోటి ఐపీఎల్ టీమ్ స‌హ య‌జ‌మాని జూహీచావ్లా ఆస్ప‌త్రికి వ‌చ్చి ప‌రామ‌ర్శించారు. కాగా ‘షారుక్ ఖాన్ కు హీట్​ స్ట్రోక్​ కారణంగా అస్వస్థకు గురయ్యారని , కేడీ హాస్పిటల్​లో జాయిన్ అయ్యి, ట్రీట్​మెంట్ తీసుకొని డిశ్చార్డి అయ్యారని అహ్మదాబాద్​ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్​ ఓం ప్రకాశ్​ జత్ పేర్కొన్నారు. ఇక షారుక్​ పఠాన్​, జవాన్​తో చెరో 1000 కోట్ల సాధించిన ఆయన డంకీ చిత్రంతో మరో 500కోట్ల వరకు వసూలు సాధించి గతేడాది హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు..ప్రస్తుతం షారుఖ్ సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి . షారుక్ కూతురు సుహానా ఖాన్ ఈ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది . ఇక కింగ్ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరూధ్​ మ్యూజిక్ అందిస్తున్నట్టు సమాచారం . రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్​పై సిద్ధార్థ్​ ఆనంద్​తో కలిసి షారుక్ ఈ​ సినిమాను దాదాపు 200కోట్ల బడ్జెట్​తో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. కూతురితో కలిసి నటించబోయే సినిమా కనుక ప్రత్యేకంగా ఉండేలా షారుక్​ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.