adipurush collection

 భారతీయ సంస్కృతికి అద్దంపట్టే రామాయణం మహాకావ్యంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. వాల్కీకి రచించిన ఇతిహాసగాథను ఆదర్శంగా తీసుకుని.. రామయణంలోని అనేక ఘట్టాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. అయితే నేటి తరానికి ఈ అద్భుత కావ్యాన్ని సరికొత్తగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాఘవుడిగా, కృతిసనన్‌ జానకీ దేవిగా పరిచయం చేస్తూ.. తెరకెక్కించిన మూవీ ఆదిపురుష్. పాన్‌ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ ఎలా ఉంది..? రాఘవుడి పాత్రలో ప్రభాస్ ఎలా యాక్ట్ చేశాడు..? బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా..? అందరికీ తెలిసిన రామాయణ గాథను ఓం రౌత్ తెరపై ఎలా చూపించారు..? 

ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని కొందరు రేటింగ్ ఇస్తుండగా… మరికొందరు పెదవి విరుస్తున్నారు.కలల తారాగణం, భారీ బడ్జెట్ ను చేతిలో ఉంచుకుని కూడా దర్శకుడు ఓం రౌత్ పెద్ద గందరగోళాన్ని సృష్టించాడు