జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఒక పాత్రకు ఎన్టీఆర్ భార్యగా ప్రియమణి నటిస్తోందనే వార్త వైరల్ అవుతోంది. అంటే, కొడుకుగా ఉన్న ఎన్టీఆర్ పాత్రకు ప్రియమణి తల్లిగా నటిస్తోందన్న మాట. ఈ వార్తతో ప్రియమణి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి తల్లి పాత్రను పోషించడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘యమదొంగ’లో ఎన్టీఆర్ సరసన ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జూనియర్ పాత్రకు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Previous articleరాజమండ్రి చర్చిలో నారా భువనేశ్వరి ప్రార్థనలు.. వీడియో ఇదిగో!
Next articleమహాగణపతి నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబు.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు