మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా విహారయాత్రకు బయల్దేరారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విరామంలో ఆయన ఫారెన్ ట్రిప్ కు టేకాఫ్ తీసుకున్నారు. అర్ధాంగి సురేఖతో కలిసి ఎమిరేట్స్ జెట్ లో అమెరికా పయనమయ్యారు. 

దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిజీ లైఫ్ నుంచి కొద్దిపాటి విరామం లభించిందని, అందుకే అమెరికా వెళుతున్నానని వెల్లడించారు. రిఫ్రెష్ అవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నానని, తిరిగొచ్చి సరికొత్త ఉత్సాహంతో తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటానని చిరంజీవి వివరించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ లో తన నెక్ట్స్ పిక్చర్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. 

గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ లకు చెందినది. బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ నుంచి తొలి చిత్రంగా ఓ ఫ్యామిలీ ఎంటర్టయినర్ మూవీ రానుంది.

Previous articleఈ నెల 9న ఏలూరు నుండి పవన్ రెండోదశ వారాహి విజయయాత్ర
Next articleకుల గణన మరియు సమస్యలపై జరిగే జాతీయ కన్వెన్షన్ కు పూర్తి మద్దతు తెలిపిన బేరి రామచందర్ యాదవ్