బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా రూపొందింది. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఇది బాలయ్య మార్కు సినిమాగానే ఉంటుందని అనిల్ రావిపూడి ముందుగానే హింట్ ఇచ్చేశాడు. ఆయన ఫస్టు లుక్ ను రివీల్ చేస్తూనే, సినిమాపై అంచనాలు పెంచేశాడు.ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. వినాయకుడి ఉత్సవాల సందర్భంలో వచ్చే పాటగా ఫస్టు సింగిల్ ఉండనుంది. బాలయ్య జోరుగా స్టెప్పులేస్తున్న పాట తాలూకు పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో అర్జున్ రాంపాల్ .. ప్రియాంక జవాల్కర్ కనిపించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.