టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు .తను నిలకడగా ఫీల్డ్ లో అవుట్ అవకుండా నిలబడ్డాడు అంటే ఓ కొత్త రికార్డు సృష్టించినట్లే .. అంతలా చెలరేగిపోతాడు కోహ్లీ .. ఇక ఐపీఎల్‌లో సోమవారం జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 77 పరుగులు బాదిన విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో అత్యంత కీలక మైలురాయిని చేరుకున్నాడు. . పంజాబ్‌పై హాఫ్ సెంచరీతో టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో 100 కంటే ఎక్కువ సార్లు 50 కంటే ఎక్కువ స్కోరును సాధించిన బ్యాట్స్ మెన్ కోహ్లీ నిలిచాడు ఇందులో 92 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలు ఉండటం విశేషం . టీ20 క్రికెట్‌లో ఎక్కువసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్‌ మొత్తం 110 సార్లు 50కిపైగా స్కోర్లు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 109 సార్లు, విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు .ఇక పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం 98, జాస్ బట్లర్ 86 నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా గత రాత్రి పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 77 పరుగులు సాధించాడు . కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. పంజాబ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరాట్ విరుచుకుపడ్డాడు