ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి.. కేటీఆర్‌ పై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వేణు స్వామి.. రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ నెట్టింట సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పలువురు హీరోయిన్ల జాతకాలు చెప్పి పరిహార పూజలు కూడా చేస్తుంటారు . అయితే వేణు స్వామి చెప్పే ప్రతి కామెంట్స్‌ నిమిషాల్లో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి. అలాగే ఒక్కోసారి విమర్శలు కూడా ఎదుర్కొంటాడు. అయినా సరే ఎవరో ఒకరి మీద సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు వేణు స్వామి. ఇదిలా ఉంటే.. తాజాగా వేణు స్వామికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ .. ‘ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కూతురు కవిత, కొడుకు కేటీఆర్‌ ముగ్గురికి సమస్యలు వస్తాయని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అలాగే జరుగుతుందన్నారు . కేసీఆర్ పార్టీ పరంగా సమస్యలు ఎదుర్కొంటే , కూతురు జైలుకు వెళ్లిందని , కొడుకు కూడా తొందరలోనే జైలుకు వెళ్ళబోతున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. 2023 నుంచి రెండున్నర సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులుంటాయని , అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని , 2023లోనే కేసీఆర్‌ తుంటి ఎముక విరిగిందన్నారు . అంతేకాకుండా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని వేణుస్వామి అన్నారు. . తాను చెప్పినట్టే ముగ్గురికి సమస్యలు వస్తున్నాయని , తాను ఊరికే చెప్పలే