నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి అతి త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో ఉన్న బోర్గో శాన్ ఫెలైస్ రిసార్ట్ లో జరగనుంది.ఈ వేడుకకు వారం ముందే వరుణ్ తేజ్, లావణ్య టుస్కానీ బయల్దేరి వెళ్లిపోయారు. వరుణ్ తేజ్ విమానంలో విండో నుంచి తీసిన ఫొటోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. వీరికి తోడుగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. డబుల్ రెయిన్ బో (రెండు ఇంద్ర ధనస్సులు), టుస్కానీ అంటూ ఆమె ఒక ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.నవంబర్ 1న టుస్కానీలో జరిగే ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు ఇలా మెగా ఫ్యామిలీ తరఫున అన్ని కుటుంబాల వారు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. హాల్దీ, మెహెందీ, సంగీత్, వివాహం ఇలా నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలకు రంగం సిద్దం చేశారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలంటైన్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఇప్పటినుంచే ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయింది.