టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత నాలుగైదు రోజులుగా ఈ జంట పేర్లు మారు మోగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ గడిచిన వారం రోజులుగా ఈ వార్తలు మరింత ఊపేందుకు ఉన్నాయి. వీళ్ళీద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఇన్విటేషన్స్ కార్డ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఇప్పటికీ చాలామంది అభిమానులకు ఇది కాస్త సస్పెన్షన్ గానే ఉంది. ఇది నిజమా లేకుంటే రూమర్స అన్న విధంగా ఆలోచనలో పడ్డారు అభిమానులు. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని, లావణ్య త్రిపాఠితో ఆయన పెళ్లి జరగనుందని కన్ఫర్మ్ అయింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట నిశ్చితార్ధ వేడుకకు సంబంధించి ఆఫీసియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుంది. ఈ మేరకు తాజాగా ఇందుకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంగేజ్‌మెంట్ వేదిక ఎక్కడనే సమాచారం మాత్రం బయటకు రాలేదు. దాంతో #VarunLav హ్యాష్ ట్యాగ్‌తో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం ఈ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.