Home Andhra Pradesh ఇంఛార్జ్ లు ఎవరు గొట్టాంగాళ్లు

ఇంఛార్జ్ లు ఎవరు గొట్టాంగాళ్లు

టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఇంఛార్జ్ లు ఎవరు గొట్టాంగాళ్లు అంటూ సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేసారు.తనకు మహానాడుకు ఆహ్వానం లేదని చెప్పారు.చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను ఎందుకు కలిసారో తనకు తెలియదని..ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాలనని వివరించారు. పార్టీలో ఇంఛార్జ్ లుగా ఉన్న గొట్టాంగాళ్ల కోసం పని చేయాల్సి వస్తోందన్నారు.పొమ్మనకుండా పొగు పెడుతున్నా రని..వంద శాతం కాలితే ఆఫర్ల గురించి నిర్ణయం తీసకుంటానని నాని స్పష్టం చేసారు
కేశినేని నాని టీడీపీలో ఆగ్రహంగా..అసౌకర్యంగా ఉన్నారని గ్రహించిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.ఇప్పుడు మరోసారి కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో ప్లెబిసైట్ నిర్వహించాలన్నారు. అప్పుడు తన బలం ఏంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.పార్టీ అలైన్ మెంట్ లో భాగంగానే ఇంఛార్జ్ లను నియమిస్తారని..వాళ్లెవరు గొట్టాంగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.

Previous articleNabha Natesh Photos
Next articleవరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ ఈ రోజే ..