‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై వచ్చిన ‘అన్ స్టాపబుల్ 1’ .. ‘అన్ స్టాపబుల్ 2’ టాక్ షోకి అనూహ్యమైన స్పందన వచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షో సీజన్ 3 కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజన్ 3ని త్వరలో ప్రారంభించనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన అప్ డేట్ ‘ఆహా’ నుంచి వచ్చింది. దాంతో సీజన్ 3లో ఫస్టు ఎపిసోడ్ లో గెస్టులుగా ఎవరు కనిపించనున్నారు? అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఫస్టు ఎపిసోడ్ లో చిరంజీవి వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ ఫస్టు ఎపిసోడ్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్ కనిపించనుందని తెలుస్తోంది. బాలకృష్ణ .. అనిల్ రావిపూడి .. శ్రీలీల పాల్గొనగా ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగిందని అంటున్నారు. ‘ఆహా’లో ఈ టాక్ షో సీజన్ 3 .. ‘భగవంత్ కేసరి’  ప్రమోషన్స్ తో మొదలవుతుందన్న మాట. ఈ సీజన్ లో చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని ముందుగానే చెప్పారు. చిరంజీవి .. కేటీఆర్ కి సంబంధించిన ఎపిసోడ్స్ తప్పనిసరిగా ఈ సీజన్ లోనే పలకరిస్తాయని అంటున్నారు. మొత్తానికి మళ్లీ అన్ స్టాపబుల్ గా సందడి మొదలు కానుందన్న మాట.