జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. రెస్పెక్టెడ్ సర్ అంటూ సీఎం జగన్ ను సంబోధించారు. మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కులగణన పేరిట సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోంది… అందుకే ఈ లేఖ రాస్తున్నానంటూ పవన్ స్పష్టం చేశారు. అందుకే ప్రజల తరఫున జనసేన పార్టీ మీకు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది… దయచేసి స్పందించండి అని కోరారు. 

అయితే, వ్యక్తిగత దూషణలకు పోకుండా, సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇక తన లేఖకు ఎన్నికల వేళ కుల గణన ఎందుకు? అనే హెడ్డింగ్ పెట్టారు. ఇందులో 12 ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీటన్నింటికీ గౌరనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని స్పష్టం చేశారు.