మచిలీపట్నం లోక్‌ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశెరిని అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్‌ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం విదితమే . అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువమంది ఉండటంతో అక్కడ సర్వే జరుగుతోందని సమాచారం . ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది. వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇంతకు ముందు బాల శౌరి 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందారు. రీసెంట్ గా ఆయన వైఎస్సార్‌ పార్టీ వీడి జనసేనలో చేరారు.. ఈసారి బాల శౌరికి పవన్ అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. జనసేన పార్టీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక కాకినాడ అభ్యర్థిగా ఉదయ్‌ను పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. ఉదయ్‌ జనసేన కోసం ఎంతో త్యాగం చేశారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పవన్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెబితే ఆలోచిస్తానని.. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్‌, కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తాం అని పవన్‌ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.