ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఆవిష్కరించడంపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ స్పందించాడు. , ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్‌ను లెజెండ్‌గా అభివర్ణిస్తూ అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ లో వార్నర్ స్పందిస్తూ… ‘‘లెజెండ్ అల్లు అర్జున్ ఎంత చక్కగా ఉన్నాడని , కంగ్రాట్స్ పుష్ప’’ అంటూ రాశాడు . అల్లు అర్జున్ మైనపు విగ్రహంతో ఫోటో దిగి వార్నర్ వార్నర్ షేర్ చేశాడు. ఈ పోస్టుపై స్పందించిన అల్లు అర్జున్.. ‘‘’థాంక్యూ మై బ్రదర్’’ అని కామెంట్ చేశాడు. కాగా డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని. సన్‌రైజర్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో నే ‘పుష్ప’ విడుదలయ్యింది అప్ప్పుడే వార్నర్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాడు. అందుకే ఐపీఎల్‌లోనే మ్యాచ్ లోనే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా పుష్ప సినిమా పాటలకు మైదానంలోనే వార్నర్ స్టెప్పులు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు . 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన తర్వాత పుష్ప పాప్యులర్ స్టైల్ ‘తగ్గేదేలా’ అని పోజు ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్ సమయంలో ‘శ్రీవల్లి’ పాటలోని స్టెప్ వేశాడు. అంతటితో ఆగకుండా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చాలా వీడియోలు అప్‌లోడ్ చేశాడు. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కూడా కొన్ని స్టెప్స్ వేయించిన వీడియోలు ఉన్నాయి. అంతేకాదు.. గతంలో ఐకాన్ స్టార్ బర్త్‌డేకి పిల్లలతో రీల్స్ రూపంలో విషెస్ కూడాcy చెప్పించాడు. . ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.