జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్నీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ముందుగా ఆయన తన వారాహీకి శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు చేయనున్నాను. అక్కడ పర్యటన సందర్బంగా దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. పిఠాపురం రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు వర్మతో పవన్ భేటీ కానున్నాను. అయితే వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ గాని తగిన గుర్తింపు పదవి ఇవ్వనున్నట్టు హామీ ఇక్కరు. దీంతో వర్మ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది . ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించు భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఈ రోజు నుండి జనసేన అధినేత పవన్ నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను బారి మెజారిటీతో గెలిపించుకునేందుకు వర్మ కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుండి వంగ గీత పోటీ చేయబోతుంది. అయితే ఆమెకు దీటుగా పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించటానికి శంఖారావం పూనుకుకున్నారు. ఇక పవన్ పొలిటికల్ ప్రచారం ప్రారంభించటంతో ఏపీ రాజకీయాలలో చర్చ మొదలైందని చెప్పాలి . పవన్ ప్రచారంలో ఏం మాట్లాడతాడు .. జనాలు ఆయనకు ఎంతవరకు మద్దతు ఇస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సారి ఎన్నికల్లో అధిక శాతం ప్రజలు పవన్ కే మద్దతు తెలుపుతారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.