స్టార్ హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది . ఓ పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరోలంతా ప్రచారం చేశారు. మరోపక్క ఇతర హీరోలతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కి మద్దతు తెలిపారు. ఇలాంటి టైం లో కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ మెగా హీరోలంతా జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ అంశం పై తాజాగా సినీ నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబమంతా మద్దతుగా ఉందని, కుటుంబంలోఒక వ్యక్తి సపోర్ట్ చేయనంత మాత్రాన పవన్ కళ్యాణ్ కు వచ్చే నష్టమేమి లేదని, ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని నట్టి కుమార్ అన్నారు. టాలీవుడ్ లో మహా వృక్షమైన మెగాస్టార్ చిరంజీవి కారణంగానే మెగా హీరోలంతా ఎదిగారని, అల్లు అర్జున్ కూడా అంతేనని ఆయన అన్నారు . వైసీపీ అభ్యర్థి కోసం బన్నీ వెళ్లడం తనకు అస్సలు నచ్చలేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని నట్టికుమార్ అన్నారు. దీనిపై బన్నీ కూడా ఆలోచించాలని… బన్నీ వెళ్లిన ఫొటోలు, వీడియోలను వైసీపీ తనకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మంత్రులందరూ ఓటమిని చవిచూడబోతున్నారని నట్టి కుమార్ జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రలో కూటమి ఘన విజయం సాధించబోతోందని… గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వ్యక్తిగా ఈ విషయాన్ని తాను చెపుతున్నానని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని… కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి మీద మమకారంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని… గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని నట్టి కుమార్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కూటమి విజయం సాధించబోతోందని నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు.