కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్ పై అమిత్ షా షాకింగ్ కామెంట్స్ ..!

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ విషయం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్‌పై మాత్రమే వచ్చారని, తిరిగి జైలుకు వెళ్లవలసిందే అన్నారు. తాజాగా అమిత్ షా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే ప్రచారంలో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ అద్మీ పార్టీ, కూటమి గెలిస్తే మళ్ళీ తాను జైలుకు వెళ్లే పని లేదన్న కేజ్రీవాల్ మాటలను అమిత్ షా తప్పుబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మాటలు కోర్టును దిక్కరించినట్టే అవుతుందని, ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు గెలిస్తే కోర్టు జైలుకు పంపదన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బెయిల్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో న్యాయస్థానం ఆలోచించాలని, తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు .కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదని, ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు. తిరిగి ఆయన జైలుకు వెళ్లవలసిందేనని ,అలాంటప్పుడు ఇది కేజ్రీవాల్‌కు అనుకూల తీర్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తీహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలు ప్రధాని కార్యాలయానికి చేరుతున్నాయన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను కూడా అమిత్ షా ఖండించారు.