Pawankalyan Varahi

 ఓ వైపు సినిమాల్లో.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయ్యాడు పవన్. దీంతో ఏమాత్రం రెస్ట్ లేకుండా బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఈ క్రమంలో విశ్రాంతి లేకుండా పర్యటలను సాగిస్తుండడంతో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా పవన్ అస్వస్థకు గురయ్యారు. భీమవరంలో పర్యటిస్తున్న ఆయన స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు షాక్ అయ్యారు. వారాహి యాత్రలో బాగంగా పెద అమిరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉన్న ఆయనకు మంగళవారం అనారోగ్యానికి గురైటనట్లు తెలియడంతో వైద్యులు చికిత్స చేశారు. అయతే కాస్త రెస్ట్ తీసుకోవాలని తెలిపారు. దీంతో పవన్ తరువాత కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.