pawankalyan
pawankalyan

వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టనో చూద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సవాలు విసిరారు. కచ్చితంగా జనసేన పాదముద్ర అసెంబ్లీలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే కక్ష కట్టి, తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉంటే, మొత్తం లక్షా 8 వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభను కాకినాడ జిల్లా కత్తిపూడి (Kattipudi) లో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేశారు.

Previous articleమామ ‘భోళా శంకర్’ అల్లుడు ‘గోలి శంకర్‌’
Next articleసువర్ణ భూమి సంస్థ స్కాం