sai dharamtej new movie
sai dharamtej new movie

ఇటీవల విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువహీరో సాయిధరమ్‌తేజ్‌.ఆయన తదుపరి చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహించబోతున్నారు. మాస్‌ కథాంశాల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు సంపత్‌నంది. ఈ సినిమా కోసం కూడా పక్కా మాస్‌ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేశారని తెలిసింది.ఈ చిత్రానికి ‘గోలి శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది.