kcr-national
kcr-national

తాతలు, తండ్రుల పేర్లు చెబితే ప్రజలు ఓట్లేయరని, అస్సలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనం చేసిన అబివృద్ధే మనల్ని గెలిపిస్తుందంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు పేర్లతో పని లేదని. పని చేయగల్గిన వాళ్లతోనే పని అంటూ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే  రైతులకు బతుకులు ఇలా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల ప్రజలు అప్పటికీ అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే… పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయని అన్నారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదని.. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం kcr స్పష్టం చేశారు.