తెలంగాణ విపక్షం బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఓ బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా, శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు… నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే ఎవరు కాదన్నారు… అంతేగానీ, త్వరలో ప్రభుత్వం కూలిపోతుంది, పడిపోతుంది అనడం సరికాదు అని ప్రొఫెసర్ కోదండరాం హితవు పలికారు. గత పాలకులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు. పైసలతో ఏమైనా చేయగలమనే అహంభావం బీఆర్ఎస్ లో ఉందని విమర్శించారు.