మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. పుష్ప2 షూటింగ్ బిజీ వల్ల అల్లు అర్జున్ హాజరు కాలేదు. వచ్చే నెల వరుణ్, లావణ్యల పెళ్లి జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మరోవైపు ఇటీవలే వరుణ్ తేజ్ తన మిత్రులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. స్పెయిన్ లో జరిగిన ఈ పార్టీకి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు 40 మంది స్నేహితులు వెళ్లారు.