పవన్ నేటి నుంచి జనసేన ఎన్నికల ప్రచారాన్ని తిరిగి కొనసాగించనున్నారు. ఈ సాయంత్రం అనకాపల్లి సభలో పాల్గొననున్నారు. కొద్దిసేపటి కిందట పవన్ హెలికాప్టర్లో అనకాపల్లి చేరుకున్నారు. ఆయనకు జనసేన నేత కొణతాల రామకృష్ణ, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి బుద్ధా నాగజగదీశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. కాగా, ఈ సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ లో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరుకానున్నారు. 

రేపు (ఏప్రిల్ 8) పవన్ ఎలమంచిలిలో జరిగే విజయభేరి సభకు హాజరవుతారు. ఎల్లుండి (ఏప్రిల్ 9) పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.