మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక ముఠా కార్మికులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులేనని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానం తీసుకువచ్చి, నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.