హైదరాబాద్ నగరానికి వరప్రదాయని ఐన ఔటర్ రింగు రోడ్డు గంజాయి స్మగ్లింగ్ కు రాచబాటగా మారుతుంది. భారీ ఎత్తున నగరాన్ని ముంచెత్తుతున్న గంజాయి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఎవ్వరి కంటబడకుండా ఔటర్ ఎక్కితే చాలు.. క్షేమంగా గమ్యానికి చేరుకోవచ్చనే ఆలోచనతో గంజాయి స్మగ్లర్లు ఔటర్ రింగు రోడ్డును తమ రవాణా కేంద్రంగా మార్చుకుంటున్నారు. ఎక్కడ బందోబస్తు లేదో చూసి ఔటర్ ఎక్కడం… అనువైన ఎక్జిట్ చూసుకొని ఔటర్ దిగి నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్, ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేయడం ఔటర్ రింగు రోడ్డు స్మగ్లర్లకు అత్యంత అనువయిన రహదారిగా మారిపోయింది. నగరానికి వచ్చే గంజాయి తో పాటు తెలంగాణ మీదుగా రాష్ట్రాలు దాటే గంజాయి రవాణాకు సైతం స్మగ్లర్లు ఔటర్ నే ఎంచుకుంటున్నారు.