sapthagiri
sapthagiri

మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి రానున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరున్న సప్తగిరి రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. . టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించారు. 

తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సప్తగిరి తన మనసులో మాట చెప్పారు. తాను చిత్తూరు లోక్‌సభ లేద అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన తాను ఐరాల ప్రభుత్వాసుపత్రిలో జన్మించినట్టు తెలిపారు. తన విద్యాభ్యాసం మొత్తం బంగారు పాళ్యం, పుంగనూరులో జరిగిందని చెప్పుకొచ్చారు. తనకు పేదల కష్టాలు తెలుసని… తాను కూడా చిన్న స్థాయి నుంచి నేడీ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తాను వదులు కోనన్నారు.tdp నుంచి పోటీ చేయాలని ఉందని అభిప్రాయపడ్డారు. పది పదిహేను రోజుల్లో మరింత క్లారిటీ ఇస్తానన్నారు