Home Andhra Pradesh వైసీపీ కోరిక తీరేనా?

వైసీపీ కోరిక తీరేనా?

టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం అవడం రాజకీయ సమావేశమే అని వైసీపీ కూడా గట్టిగా నమ్ముతోంది.టిడిపి పొత్తులు పెట్టుకొంటే వైసీపీ నష్టపోతుందని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరికీ తెలుసు. అందుకే పొత్తులు పెట్టుకోవడం అంటే ‘రాజకీయ వ్యభిచారమే’ అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారం పంచుకోవడం నేరమే అయితే గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం, గత 9 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా నేరం చేస్తున్నట్లే కదా? టిడిపికి బిజెపి దగ్గర కాకుండా అడ్డుకొనేందుకు ఆ ఎన్డీయే కూటమిలో వైసీపీ చేరేందుకు సిద్దపడిందని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి కదా?అవే నిజమైతే మరి వైసీపీ కూడా నేరం చేస్తున్నట్లే కదా? పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో చేతులు కలపకుండా అడ్డుకొనేందుకు, వైసీపీ నేతలు ఆయనను ఈసడించారు… అవమానించారు.. ఆయన గురించి చాలా అనుచితంగా, చులకనగా మాట్లాడారు. తద్వారా ఆయనను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన వారి ఉచ్చులో చిక్కుకుపోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటేనే వైసీపీ నష్టపోతుందని ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అమిత్‌ షా, జేపీ నడ్డాలు భేటీ కావడం జీర్చించుకోవడం చాలా కష్టమే. ఒకవేళ బిజెపి కోడా వారితో కలిస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి తప్పదు. ఒకవేళ ఓడిపోతే, ఇంతకాలం టిడిపి, జనసేనలను వేధించినందుకు, వైసీపీలో అందరూ మూల్యం చెల్లించకతప్పదు

Previous articleRakul Preet Singh New Photos
Next articleఏపీలో ముందస్తు ఎన్నికల వేడి ?