నితిన్ హీరోగా రూపొందిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ సినిమా డిసెంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే ఖర్చు పెట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నితిన్ కి మరో ఫ్లాప్ ను కట్టబెట్టేసింది. 
ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన గానీ .. 12వ తేదీన గాని ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్న మాట.