స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 41 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఈరోజుతో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను వర్చువల్ గా అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.