చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రచారం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు

‘భోళా మేనియా త్వరలో ప్రారంభమవుతుంది’ అనే క్యాప్షన్ తో అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి స్టైలిష్ గెటప్‌ లో రెండు చేతులు వెనుక జేబులో పెట్టుకొని చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ ని చూపించారు. ఈ ఒక్క స్టిల్ తో, సినిమాలో చిరంజీవి స్టెప్పులు ఓ రేంజ్ లో ఉంటాయనే విషయాన్ని వెల్లడించారు మేకర్స్.

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూటింగ్, భారీ సెట్ సాంగ్ పెండింగ్‌ లో ఉన్నాయి. జూన్ నెలాఖరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఆగస్ట్ 11న భోళాశంకర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ కనిపించనుంది. సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.