అల్లు అర్జున్ కు రాయలసీమ రుచులతో టీడీపీ నేత విందు ఇచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ నేత ముంటిమడుగు కేశవరెడ్డి ఈ విందు ఇచ్చారు. అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నిన్న కారులో వెళ్తూ… గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద ఉన్న కేశవరెడ్డి ఫామ్ హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంగా బన్నీకి కేశవరెడ్డి, ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి స్వాగతం పలికారు. రాయలసీమ రుచులతో విందు భోజనం పెట్టారు. అల్లు అర్జున్ వచ్చాడనే విషయం తెలియగానే ఫామ్ హౌస్ కు జనాలు పోటెత్తారు. అభిమానులతో ఫామ్ హౌస్ కిటకిటలాడింది. ఫ్యాన్స్ కు బన్నీ అభివాదం చేశారు. బన్నీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెంగళూరుకు బయల్దేరారు.