భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జగనన్న కాలనీల పరిస్థితిపై రేపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను చేపట్టనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదికలు పేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేసింది. ఏం చేయాలో కూడా సూచించింది.రేపు ఉదయం 10 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేసేందుకు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. 

ఏం చేయాలి?

జగనన్న కాలనీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫోటోలు, వీడియోలు తీసి మీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయాలని జనసేన సూచించింది.

కనీసం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియో తీయాలని, అలాగే అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టేలా ఫోటోలు ఉండాలని పేర్కొంది.

సోషల్ మీడియా పోస్టులో FailureofJaganannacolony అనే హ్యాష్ ట్యాగ్ ఉండాలని వెల్లడించింది.

మీ వివరాలతో పాటు సోషల్ మీడియా లింక్స్, నాలుగు ఫోటోలు, నిమిషం వీడియోను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పంపించాలని సూచించింది.

మీ వివరాల్లో పేరు, పార్టీ పదవి, నియోజకవర్గం, మండలం, గ్రామం వివరాలు కచ్చితంగా ఉండాలని తెలిపింది.

6304900820 లేదా 6304900819 నెంబర్లకు వాట్సాప్ కు ఈ కార్యక్రమ వివరాలు పంపించాలని తెలిపింది.