ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే మన అందరికి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈరోజు, రేపు విచారణ కొనసాగనుంది.

Previous articleచిరంజీవి 45 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకోవడంపై రామ్ చరణ్ స్పందన
Next articleసింగరేణి అవినీతిపై ఈటల సంచలన ఆరోపణలు