అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ గద్దర్ గారు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ పరిస్థితులపై కొంతసేపు ముచ్చటించుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనను పరామర్శించినందుకు గద్దర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజకీయం పద్మవ్యూహం వంటిదని అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా గద్దర్ అన్నారు. ప్రస్తుతం భారతదేశం యువతతో నిండి ఉందని , 60 శాతం మంది యువతే ఉన్నారని ఆయన అన్నారు. ఇటువంటి యువతకు నీ వంటి యువ నాయకుల నాయకత్వం ఎంతో అవసరమని వ్యాఖ్యానిస్తూ విజయం నీదేనని ఒక అన్నగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Previous articleజగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్
Next articleత్వరలోనే భారత్ జోడో యాత్ర 2.0..