టీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి. శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యుజే -ఐజేయూ) జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రోజు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లతో కలసి సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డుల ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ లు పోషించిన భూమిక అత్యంత కీలకమైనది అనీ అనేక సార్లు సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ప్రశంసించి ఉద్యమ నేతగా ఆ తర్వాత ముఖ్యమంత్రి గా జర్నలిస్ట్ లకు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నం అయినా ఇళ్ల స్థలాలు అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని మరి కొందరు వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారన్నారని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు ఆరోగ్య పథకం కింద అందించిన హెల్త్ కార్డులు అమలయ్యేలా వెంటనే చర్యలకు తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టు బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తమ సంఘం ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనలో భాగంగా వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ కు పదివేల పోస్టు కార్డుల పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఉమ్మడి జిల్లా బ్యూరో ఇంచార్జి సామ జైపాల్ రెడ్డి, సాక్షి జిల్లా ప్రతినిధి శ్రీశైలం, సూర్య ఉమ్మడి జిల్లా ప్రతినిధి గణేష్, ప్రజాపక్షం ఉమ్మడి జిల్లా ప్రతినిధి జంగయ్య, దిశ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సురేష్, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.