వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ డిమాండ్. శేరిలింగంపల్లి కొండాపూర్ పవర్ ఆఫ్ జనరల్ ఇజంన్యూస్ ; తెలంగాణలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీతరపున రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రేటర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ. వరదల్లో ప్రజలు చిక్కుకుపోతే బీఆరెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు గ్రేటర్ లో వరదలకు బీఆరెస్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పాలకవర్గం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 2020 లో వచ్చిన గ్రేటర్ వరదలతో ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సహాయం ప్రకటించి ఎన్నికలు ముగియగానే ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. చిన్న వర్షాలకే నగరంలోని రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చామని చెబుతున్న కేటీఆర్ నగరం వరదలతో గ్లోబ్ లోనే కనిపించకుండా పోతుంటే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ కేవలం మాటల ప్రభుత్వమే తప్ప చేతలు మాత్రం శూన్యం అని ఎద్దేవా చేశారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని హెచ్చరించారు.